Product SiteDocumentation Site

Red Hat Enterprise Linux 5

Release Notes

Red Hat Enterprise Linux 5.11 విడుదల నోట్స్

సంచిక 11

Red Hat వినియోగదారి కాంటెంట్ సేవలు


చట్టబద్ద నోటీసు

Copyright © 2014 Red Hat, Inc.
The text of and illustrations in this document are licensed by Red Hat under a Creative Commons Attribution–Share Alike 3.0 Unported license ("CC-BY-SA"). An explanation of CC-BY-SA is available at http://creativecommons.org/licenses/by-sa/3.0/. In accordance with CC-BY-SA, if you distribute this document or an adaptation of it, you must provide the URL for the original version.
Red Hat, as the licensor of this document, waives the right to enforce, and agrees not to assert, Section 4d of CC-BY-SA to the fullest extent permitted by applicable law.
Red Hat, Red Hat Enterprise Linux, the Shadowman logo, JBoss, MetaMatrix, Fedora, the Infinity Logo, and RHCE are trademarks of Red Hat, Inc., registered in the United States and other countries.
Linux® is the registered trademark of Linus Torvalds in the United States and other countries.
Java® is a registered trademark of Oracle and/or its affiliates.
XFS® is a trademark of Silicon Graphics International Corp. or its subsidiaries in the United States and/or other countries.
MySQL® is a registered trademark of MySQL AB in the United States, the European Union and other countries.
All other trademarks are the property of their respective owners.


1801 Varsity Drive
RaleighNC 27606-2072 USA
Phone: +1 919 754 3700
Phone: 888 733 4281
Fax: +1 919 754 3701

సంక్షిప్తము
విడివిడి విస్తరింపు యొక్క సమ్మేళనమే Red Hat Enterprise Linux చిన్న విడుదలలు, రక్షణ మరియు బగ్ ఫిక్స్ యెర్రాటా. Red Hat Enterprise Linux 5.11 విడుదల నోట్స్ అనునది Red Hat Enterprise Linux 5 ఆపరేటింగ్ సిస్టమ్‌కు మరియు దాని అనుభందిత అనువర్తనముల కొరకు యీ చిన్న విడుదల నందు చేసిన పెద్ద మార్పులను పత్రకీకరణ చేయును. ఈ చిన్న విడుదల నందలి అన్ని మార్పులపైని విశదీకృత నోట్స్ సాంకేతిక నోట్స్ నందు అందుబాటులో వుంటాయి.

ముందుమాట
1. సంస్థాపన మరియు బూటింగ్
2. కెర్నల్
3. పరికర డ్రైవర్లు
4. సబ్‌స్క్రిప్షన్ నిర్వహణ
5. వర్చ్యులైజేషన్
6. పరిశ్రమ ప్రమాణాలు మరియు ధృవీకరణం
A. పునర్విమర్శిత(రివిజన్) చరిత్ర

ముందుమాట

Red Hat Enterprise Linux 5.11 నందు ఇంప్లిమెంట్ చేసిన మెరుగుదలలు మరియు చేర్పుల కవరేజ్‌ను విడుదల నోట్స్ అందించును. Red Hat Enterprise Linux 5.11 నవీకరణకు చెందిన అన్ని మార్పులపై విశదీకృత పత్రకీకరణ కొరకు, సాంకేతిక నోట్స్ చూడండి.

అధ్యాయము 1. సంస్థాపన మరియు బూటింగ్

dmidecode అనునది SMBIOS కు తోడ్పాటునిచ్చును

dmidecode ఉపలభ్యం ఇప్పుడు సిస్టమ్ మేనేజ్‌మెంట్ BIOS (SMBIOS) వర్షన్ 2.8 కు తోడ్పాటునిచ్చును, ఇది dmidecode ను విస్తృత స్థాయిలో వివిధ హార్డ్‌వేర్‌పై బిల్డ్ మరియు నియోగాలను స్వయంచాలనం చేయుటకు చేతనించును.

అధ్యాయము 2. కెర్నల్

కాలముగింపు విలువకు నియంత్రణి

Red Hat Enterprise Linux 5.11 kernel ఇప్పుడు I/O ఎర్రర్ రికవరీ ఆదేశాలకు కాలముగింపు విలువను నియంత్రించే ఐచ్చికం కలిగివుంది. గతంలో, తిరిగిప్రయత్నించే విలువ 5 కు అమర్చబడెను, ఫలితంగా 90-సెకండ్ గడువు వుందని సందేశాలు వచ్చేవి. తిరిగిచేసే ప్రయత్నాలు తగ్గించుట ద్వారా కాలంముగియు లేయర్ల యొక్క మరింత మెరుగైన నిర్వహణను పొందవచ్చు.

MegaRAID SAS డ్రైవర్‌తో LSI 12 Gb/s ఎడాప్టర్లు

LSI MegaRAID SAS 9360/9380 12Gb/s నియంత్రికలు, గతంలో సాంకేతిక ముందస్తుదర్శనంలా తోడ్పాటునీయబడెను, ఇప్పుడు Red Hat Enterprise Linux 5.11 నందు పూర్తిగా తోడ్పాటునీయబడుచున్నవి.

అధ్యాయము 3. పరికర డ్రైవర్లు

ProLiant సేవికల తోడ్పాటు

cciss డ్రైవర్ అనునది ఇప్పుడు సరికొత్త HP SAS స్మార్ట్ ఎరే నియంత్రికలతో ProLiant సేవికలకు తోడ్పాటునిచ్చును.

అధ్యాయము 4. సబ్‌స్క్రిప్షన్ నిర్వహణ

Red Hat తోడ్పాటు సాధనం నందు విశదీకృతమైన దోష సందేశీకరణ

ఉదాహరణకు తగినంత డిస్కు జాగా లేకపోవడం వలన, డీబగ్ చిహ్నాలను దిగుమతిచేయలేనప్పుడు Red Hat తోడ్పాటు సాధనం ఇప్పుడు మరింత వివరణాత్మక సందేశాలను ప్రదర్శిస్తోంది.

సబ్‌స్క్రిప్షన్ నిర్వాహిక

Red Hat Enterprise Linux 5.11 నందలి సబ్‌స్క్రిప్షన్ నిర్వాహిక ఇప్పుడు వాడుకరి ఎటాచ్‌మెంట్ తరువాత yum ఉపలభ్యం కొరకు వేచివుండకుండా తక్షణమే redhat.repo ఫైల్ పుట్టించును.
సబ్‌స్క్రిప్షన్ రకం క్షేత్రం సబ్‌స్క్రిప్షన్ నిర్వాహిక నందు చేర్చబడెను. మీరు ఏరకమైన సబ్‌స్క్రిప్షన్ ఉపయోగిస్తున్నారో మీకు తెలుసుకొనుటకు కమాండ్-లైన్ ఇంటర్ఫేస్ అదేవిధంగా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్‌నందు చూడవచ్చు, అది సబ్‌స్క్రిప్షన్ ప్రవర్తనను నడిపించే యాట్రిబ్యూట్లను నిర్ణయించును.
సబ్‌స్క్రిప్షన్ నిర్వాహిక GUI నందు ఇప్పుడు మీరు నేరుగా నిర్వహించుటకు రిపోజిటరీలను చేతనం మరియు అచేతనం చేయవచ్చు.
కమాండ్-లైన్ ఇంటర్ఫేస్‌కు చాలా విస్తరింపులు జోడించబడెను:
  • Red Hat Enterprise Linux 5.11 నందు, బగ్ నివేదికకు అనుబందించవలసిన ఫైళ్ళను కలిగివుండే tar ఫైల్‌ను rhsm-debug system సాధనం సృష్టించును.
  • subscription-manager list --available ఆదేశం అవుట్పుట్‌కు రెండు కొత్త క్షేత్రాలు జతచేయబడెను. వ్యవస్థ అర్హత గల్గిన ఉత్పత్తుల పేర్లను Provides క్షేత్రం అందించును. కంపైలెన్స్ అనుకూలతకు మరియు GUI తో సామ్యతను అందించుటకు Suggested క్షేత్రం జతచేయబడెను.
  • subscription-manager list --available ఆదేశం యొక్క అవుట్పుట్ ఇప్పుడు స్టాక్-కీపింగ్ యూనిట్ (SKU) కలిగివుటుంది.

అధ్యాయము 5. వర్చ్యులైజేషన్

ESXi కొరకు తోడ్పాటు

virt-who ఏజెంట్ Red Hat Enterprise Linux 5.11 నందు నడుచునప్పుడు, virt-who ఇప్పుడు VMWare ESXi తో సంప్రదించును మరియు Red Hat సబ్‌స్క్రిప్షన్ నిర్వాహిక కొరకు హోస్ట్ మరియు గెస్ట్ మాపింగ్ సమాచారం పొందును.

అధ్యాయము 6. పరిశ్రమ ప్రమాణాలు మరియు ధృవీకరణం

OpenSCAP కొరకు NIST ధృవీకరణం

OpenSCAP 1.0.8 అనునది నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాన్డర్డ్స్ అండ్ టెక్నాలజీ (NIST) యొక్క సెక్యూరిటీ ఆటోమేషన్ ప్రొటోకాల్ (SCAP) 1.2 చేత ధృవీకరించబడింది అది కామన్ వల్నర్‌బిలిటీస్ అండ్ ఎక్సుపోజర్ (CVE) ఐచ్చికంతో గల ఆంథెటికేటెడ్ స్కానర్ కాటగిరీ ఐచ్చికంనందు చేయబడింది. కొత్త SCAP సాధనాలను అనుకూలంగా మలచుటకు SCAP ప్రమాణపు ప్రతి కాంపోనెంట్‌ను పార్స్ చేయుటకు మరియు విలువకట్టుటకు OpenSCAP లైబ్రరీను అందించును. ఇంకా, OpenSCAP అనునది బహుళ-ప్రయోజన సాధనం అందించును ఇది కాంటెంట్‌ను పత్రాలలోకి ఫార్మాట్ చేయుటకు లేదా ఈ కాంటెంట్‌పై ఆధారపడి వ్యవస్థ స్కాన్ చేయుటకు రూపొందించబడెను.

పునర్విమర్శిత(రివిజన్) చరిత్ర

పునఃపరిశీలన చరిత్ర
పునఃపరిశీలన 0.0-0.0Tue Aug 05 2014Milan Navrátil
Red Hat Enterprise Linux 5.11 విడుదల నోట్స్ విడుదల.